: తొలిసారిగా శాసన మండలిలో మాట్లాడిన లోకేష్... ఏమన్నారంటే!
నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్, నేడు మండలిలో తొలిసారిగా ప్రసంగించారు. మండలి అధ్యక్షుడు హౌస్ ను ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారని కితాబిచ్చారు. ప్రతిపక్షం చక్కటి అభిప్రాయాలను ఇస్తోందని, ఇలాగే అసెంబ్లీలో కూడా పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తనను ఎంతో మంది సభ ఎలావుందని అడుగుతున్నారని, ఇక్కడ కూర్చోవడం ఓ సరికొత్త అనుభూతిని ఇస్తోందని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. మండలి ఉపాధ్యక్షుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని ఎన్నుకోవడం తనకు సంతోషాన్ని కలిగించిందని, ఆయన తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరని చెప్పారు. పార్టీ తనపై ఉంచిన బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని అన్నారు. ఆయన ప్రసంగం క్లుప్తంగా సాగింది.