: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలిని జైలుకి తరలించిన పోలీసులు
అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కున్న దక్షిణ కొరియా మాజీ దేశాధ్యక్షురాలు పార్క్ గెన్ హైకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆమెను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అక్రమాలకు పాల్పడిందని తెలపడానికి కావాల్సినన్ని ఆధారాలు ఉన్నాయని, ఆమెను అరెస్టు చేయకుంటే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ప్రాసిక్యూటర్ ఆఫీసు నుంచి ఆమెను నేరుగా జైలుకు తరలించారు.