: అమెరికాలో మరోసారి కాల్పుల మోత... ఐదుగురి మృతి
అమెరికాలోని షికాగో సమీపంలో కాల్పుల మోత మోగింది. ఆ ప్రాంతంలో వేర్వేరు చోట్ల ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆరా తీస్తోన్న అక్కడి పోలీసులు పలు వివరాలు తెలిపారు. షికాగోలోని సౌత్‌షోర్ ప్రాంతంలో గల రెస్టారెంట్ సమీపంలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడని, దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. అయితే, రెస్టారెంట్ వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకోకముందు కూడా అక్కడి సమీపంలోని ఓ ఇంట్లో కాల్పుల శబ్దం వినిపించిందని, అక్కడ నాలుగు నెలల గర్భిణి తలలో బులెట్ గాయంతో రక్తపు మడుగులో పడిపోయి ఉందని చెప్పారు. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.