: వచ్చే ఏడాది 'ఎన్టీఆర్' సినిమా!: బాలకృష్ణ
దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తానని, అందులో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని నందమూరి బాలకృష్ణ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో, బాలకృష్ణ ఈ రోజు ఆ సినిమాపై మరోసారి స్పందించారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో తీసే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని ప్రకటించారు. ఏప్రిల్ 2వ తేదీన తాను విజయవాడలోనే ఉంటున్నట్లు తెలిపారు. ఆ రోజు అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంది కదా? అని ఆయన మంత్రివర్గ విస్తరణను పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో అనంతపురానికి ఎన్నడూ లేని విధంగా నీటి కేటాయింపులు జరిగాయని తెలిపారు.