: మా తదుపరి లక్ష్యం దక్షిణాదే!: వెంకయ్య మనసులో మాట
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తోందని, తమ తదుపరి లక్ష్యం ఐదు దక్షిణాది రాష్ట్రాలేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుపతికి వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచిందని, ప్రస్తుతం తాము 11 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామని, ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వెళుతుందని అన్నారు. నరేంద్ర మోదీకి ప్రజాకర్షణ అధికంగా ఉందని, ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలపై ప్రజలకు నమ్మకం లేదని తెలిపారు. అభివృద్ధి దాహాన్ని తీరుస్తున్న మోదీ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ప్రయాణం సాగించనున్నామని పేర్కొన్నారు.