: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్‌ పోడియం ఎక్కి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం కాగానే పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలో నిన్న జరిగిన ప్రమాదంపై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ఆ అంశంపై చర్చిద్దామని స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు అన్నారు. మొద‌ట దానిపైనే చ‌ర్చించాల‌ని వైసీపీ స‌భ్యులు గంద‌రగోళం సృష్టించారు. దీంతో స‌భ 10 నిమిషాలు వాయిదా పడింది. అయితే, వాయిదా త‌రువాత ప్రారంభ‌మైన స‌భ‌లో కూడా గంద‌ర‌గోళం చెల‌రేగింది. వైసీపీ స‌భ్యులు పోడియం ఎక్కి స్పీకర్‌ పక్కనే నిల్చుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News