: త్రిపురలో 10 వేల మంది ఉపాధ్యాయులకు ఉద్వాసన!
త్రిపురలో 2010 నుంచి 2013 వరకు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు నిబంధనల ప్రకారం జరగలేదని మే 7, 2014న త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10,323 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోనున్నారు. సుప్రీం తీర్పుతో ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి తపన్ చక్రవర్తి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ గురువారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించగా, టీఎంసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు మే 31లోగా ఉపాధ్యాయ నియాకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఈ ఏడాది డిసెంబరు 31 లోగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.