: నెల్లూరు టీడీపీలో వేడెక్కిన రాజకీయం.. మంత్రి పదవిపై సోమిరెడ్డి ధీమా!
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందన్న వార్తలతో టీడీపీలో హడావుడి మొదలైంది. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక మంత్రివర్గంలో స్థానంపై నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. బీసీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని కోరేందుకు అదే జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర కూడా సిద్ధమవుతున్నారు.
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరిపే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ సోమిరెడ్డికి అవకాశం కల్పించవచ్చనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దశాబ్దకాలం తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని సోమిరెడ్డి భావిస్తున్నారు. అరు నెలల ముందు నుంచే ఆయన తన ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు, లోకేశ్‌తో టచ్‌లో ఉంటూ తన బెర్త్ ఖాయం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు బీదా రవిచంద్ర కూడా రంగంలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.