: మీది విండోస్ ఫోనా?.. ఏప్రిల్ నుంచి ‘ఫేస్‌బుక్ మెసెంజర్’ యాప్ పనిచేయదు!
ఏప్రిల్ నుంచి అన్ని విండోస్ ఫోన్లలో ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ నిలిచిపోనుంది. విండోస్ 8, 8.1 మోడల్ ఫోన్లతోపాటు విండోస్ 8, 8.1 డెస్క్‌టాప్ వెర్షన్లలోనూ మెసెంజర్ యాప్ నిలిచిపోతుందని ఫేస్‌బుక్ తెలిపింది. పాత మొబైల్ వెర్షన్లలో మెసేజింగ్ యాప్‌ను నిలిపివేస్తున్నామని, దీనిని తిరిగి పొందాలంటే ఫేస్‌బుక్ లైట్‌లోకి మారడం కానీ, ఓఎస్, యాప్‌ల లేటెస్ట్ వెర్షన్లను అప్‌డేట్ చేసుకోవడడం కానీ చేయాలని సంస్థ పేర్కొంది. కాగా, ఈ ఏడాది మొదట్లో విండోస్ ఫోన్ల నుంచి స్కైప్, వాట్సాప్ కూడా మాయమయ్యాయి.