: భారత్ లో 'మిషన్ ఇంపాజిబుల్-6' షూటింగ్


ప్రముఖ హాలీవుడ్‌ యాక్షన్ హీరో టామ్ క్రూస్ ప్రధాన పాత్రలో 'మిషన్‌ ఇంపాజిబుల్‌' ఆరో సిరీస్‌ రూపకల్పనకు సిద్ధమవుతోంది. ఆరో భాగం షూటింగ్ లండన్‌, పారిస్‌, న్యూజిలాండ్‌ తో పాటు భారత్ లో కూడా జరగనుందని టామ్ క్రూస్ తెలిపాడు. 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ లో ఐదో భాగమైన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌-రోగ్‌ నేషన్‌’ యాక్షన్ కంటే ఎక్కువ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఈ ఆరో భాగం అభిమానులను అలరించనుందని టామ్‌ క్రూస్ చెప్పాడు. కాగా, 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన ఐదు సిరీస్‌ లు బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 27న విడుదల చేయనున్నట్టు టామ్ క్రూస్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News