: ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ఐదుగురు టీమిండియా దిగ్గజాలకు సన్మానం


ఏప్రిల్ 5న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో టీమిండియాకు విశేష సేవలందించిన ఐదుగురు దిగ్గజ మాజీ క్రికెటర్లను సన్మానించాలని నిర్ణయించినట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, టీమిండియాకు విశేషమైన సేవలందించిన దిగ్గజ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లను సన్మానించనున్నామని తెలిపారు. ఈ ఐదుగురిలో లక్ష్మణ్ మినహా మిగిలిన నలుగురూ టీమిండియాకు కెప్టెన్ లుగా వ్యవహరించారు. కాగా, వీరి సమకాలీనుడైన మరో దిగ్గజ ఆటగాడు, ప్రస్తుత టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే పేరును విస్మరించడం గమనార్హం. 

  • Loading...

More Telugu News