: డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ గా కూతురు ఇవాంకా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురు, అల్లుడు మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు. అందుకే, అల్లుడు జేడ్ కుష్నర్ ను సీనియర్ సలహాదారుగా నియమించుకున్నారు. తాజాగా, తన కుమార్తె ఇవాంకా ట్రంప్ ను సలహాదారుగా నియమించుకున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఇవాంకా ట్రంప్ సలహాదారుగా నియమితులయ్యారని పేర్కొంది. ఇందుకు ఆమె రూపాయి కూడా జీతంగా తీసుకోరని వైట్ హౌస్ ప్రకటించింది. జేడ్ కుష్నర్ కూడా జీరో డాలర్ల జీతానికి విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఇవాంకాకు వైట్ హౌస్ లో ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. కాగా, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇవాంకా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.