: ఏప్రిల్ 1 నుంచి విమానాశ్రయాల్లో స్టాంపింగ్, ట్యాగింగ్ ఉండవు


విమాన ప్రయాణికుల హ్యాండ్ లగేజీపై స్టాంపింగ్, ట్యాగింగ్ కు స్వస్తి చెప్పనున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో స్టాంపింగ్, ట్యాగింగ్ నిలిపివేయనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాదు, కోల్ కతా, అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చి విమానాశ్రయాల్లో హ్యాండ్ లగేజీ పై స్టాంపింగ్, ట్యాగింగ్ నిలిపివేస్తారు. కాగా, హ్యాండ్ లగేజీగా అంతర్జాతీయ సర్వీసుల్లో 7 నుంచి 10 కేజీల వరకు అనుమతిస్తుండగా, ఇండియన్ ఎయిర్ లైన్స్ లో 8 కేజీల బరువును ప్రయాణికుడితో పాటు అనుమతిస్తున్నారు. ఈ లగేజీపై కూడా ట్యాగింగ్ అనంతరం స్టాంపింగ్ ఉండేది. ఇకపై ఇది ఉండదని విమానయాన సంస్థ ప్రకటించింది. దీంతో ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. 

  • Loading...

More Telugu News