: ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఏప్రిల్ 2?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఏప్రిల్ 2న మంత్రి వర్గ విస్తరణ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం కొత్త శాసనసభ ప్రాంగణంలో కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నారా లోకేష్, భూమా అఖిల ప్రియ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, నేడు నారా లోకేష్ ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.