: కర్నూలు జిల్లాలో పిడకల సమరం ప్రారంభం!


కర్నూలు జిల్లాలో పిడకల సమరం ప్రారంభమైంది. కర్నూలు జిల్లా కైరుప్పలలో వీరభద్రస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పిడకలతో కొట్టుకోవడం ఆనవాయతీగా వస్తోంది. సంప్రదాయాన్ని పాటిస్తూ ఉగాది మరుసటి రోజు కైరుప్పలలో పిడకల సమరం జరుగుతుంది. వీరభద్ర స్వామికి మొక్కుకున్న వారు ఈ పిడకల సమరంలో పాల్గొంటారు.

ఇందు కోసం ముందుగానే భారీ ఎత్తున పిడకలను గ్రామస్తులు సిద్ధం చేసుకుంటారు. పిడకల సమరం సందర్భంగా గ్రామంలోని వారంతా రెండు వర్గాలుగా విడిపోతారు. వీటిలో ఒక వర్గాన్ని వీరభద్రస్వామి గ్రూపుగా పిలిస్తే... కాళికా అమ్మవారి గ్రూపుగా మరో వర్గాన్ని పేర్కొంటారు. గ్రామంలోని ప్రధాన కూడలివద్ద వీరంతా ఎదురుబొదురుగా నిలబడి పిడకలతో కొట్టుకుంటారు. దీనిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఔత్సాహికులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

  • Loading...

More Telugu News