: టెస్టు ర్యాంకింగుల్లో జడేజా నెంబర్ 1, అశ్విన్ నెంబర్ 2


ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. వీటిలో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ సత్తాచాటగా, కోహ్లీ, పుజారాలు దిగజారారు. ఆసీస్ తో సిరీస్ అనంతరం టెస్టు బౌలర్లలో అద్భుత ప్రతిభ కనబర్చి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన రవీంద్ర జడేజా అగ్రస్థానం ఆక్రమించగా, అశ్విన్ నెంబర్ టూ స్థానాన్ని అందుకున్నాడు. ఆల్ రౌండర్స్ జాబితాలో షకిబల్ హసన్ అగ్రస్థానంలో నిలవగా, జడేజా రెండు, అశ్విన్ మూడో ర్యాంకుకు దిగజారాడు.

బ్యాట్స్ మన్ జాబితాలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ రెండో ర్యాంకు, ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. రెండు స్థానాలు దిగజారిన పుజారా నాలుగో ర్యాంకులో నిలవగా, టీమిండియా కెప్టెన్ కోహ్లీ నాలుగో స్థానం నుంచి ఐదో ర్యాంకుకు దిగజారాడు. కేఎల్ రాహుల్ 11 ర్యాంకులు మెరుగుపరుచుకుని 11వ ర్యాంకులో నిలవడం విశేషం. మూడు స్థానాలు ఎగబాకిన రహానే 14వ ర్యాంకులో నిలిచాడు.

  • Loading...

More Telugu News