: ఒళ్లు గగుర్పొడిచే బర్త్ డే 'ట్రీట్' ... తీవ్రగాయాలపాలైన బర్త్ డే బాయ్!


హైదరాబాదులోని ఓ ఇంజనీరింగ్ హాస్టల్ విద్యార్థులు తమ స్నేహితుడి పుట్టిన రోజును ఒళ్లు గగుర్పొడిచేలా నిర్వహించారు. జగిత్యాలకు చెందిన అశోక్ కుమారుడు వినీత్ హైదరాబాదులోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేస్తున్నాడు. నిన్న పుట్టిన రోజు వేడుకలు తన స్నేహితులతో కలిసి నిర్వహించుకున్నాడు. కేక్ కటింగ్ కు ముందే అతని వేడుకలకు అతని సీనియర్లు కలిశారు. ఈసందర్భంగా బర్త్ డే బంప్స్ (విదేశాల్లో పుట్టిన రోజున స్నేహితులు కొట్టడం) ఇవ్వాలంటూ వెంటపడ్డారు. దీంతో కేక్ కోసిన వినీత్ ముఖం నిండా కేక్ పూసి, అతను దానిని తుడుచుకునేలోపు స్నేహితులంతా కలిసి కాళ్లు, చేతులు పట్టుకుని అత్యంత జుగుప్సాకరంగా బెల్టులతో చావబాదారు. దీంతో వినీత్ తీవ్ర గాయాలపాలయ్యాడు.

ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. దీని పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్య పెంపకమే ఇలాంటి హేయమైన చర్యలకు కారణమని పలువురు మండిపడుతున్నారు. పేరెంటల్ గైడెన్స్ లేకపోతే ఇలాంటి విపరీత బుద్ధులు వస్తాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News