: సమయం లేదు మిత్రమా!: అసెంబ్లీలో చంద్రబాబు నోట సినిమా డైలాగ్


సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా.. అంటూ సినీనటుడు బాలకృష్ణ గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో ప‌లికిన డైలాగులు అభిమానుల‌తో విజిల్స్ కొట్టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీలో బాల‌కృష్ణ డైలాగుని వాడారు. ఈ రోజు పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీలో ఉండే ప్రతి ఒక్క స‌భ్యుడిని అడుగుతున్నా.. రెండే ఆప్షన్స్... సమయం లేదు మిత్రమా... ఇటువంటి ఆరోప‌ణ‌లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆపేస్తారా.. లేదా? అని అన్నారు. తప్పు చేసిన వాడి తాట తీస్తానని,  ప్రతిపక్షమా.. సమయం లేదు. రా ముందుకు అని అన్నారు. దీంతో టీడీపీ స‌భ్యులు స‌భ‌లో న‌వ్వులు చిందించారు.

  • Loading...

More Telugu News