: టెర్రరిజాన్ని ద్వేషంతో జయించలేము... ప్రేమతో జయిద్దాం!: అమెరికాలో భారతీయు సిక్కు సాహసం


విద్వేషం పెరిగిపోతున్న అమెరికాలో భారతీయ యువకుడు అంగద్ సింగ్ (23) పెద్ద సాహసమే చేశాడు. జాత్యహంకారం పెరిగిపోతున్న దశలో అమెరికన్లకు ప్రేమ గురించి చెప్పాడు. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద బిగ్గరగా మాట్లాడుతూ, జాతి విద్వేషం వద్దని నినదించాడు. మార్చి 20న తిమోతి కాఫ్‌ మన్‌ అనే వ్యక్తిని ఓ శ్వేతజాతీయుడు కత్తితో పొడిచి చంపేశాడని అన్నాడు. తాను ముస్లింను కాదని, అయితే తలపాగా కట్టుకున్న ప్రతిసారీ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతానని అన్నాడు. అంత ఆందోళన చెందినా తలపాగా కట్టుకోవడానికి సందేహించనని స్పష్టం చేశాడు.

ఈ సందర్భంగా సిక్కుల తలపాగా ఎలా ఉంటుందో వారి ముందు పబ్లిక్ గా కట్టుకుని చూపించాడు. విద్వేషంతో టెర్రరిజాన్ని జయించలేమని అన్నాడు. అదే సమయంలో ప్రేమతో టెర్రరిజాన్ని జయించవచ్చని అంగద్ సింగ్ తెలిపాడు. ఈ సందర్భంగా అంగద్ ను పలువురు అభినందించారు. మరికొందరు హగ్ ఇచ్చి తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయగా, దానిని 5 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.



  • Loading...

More Telugu News