: ఉగాది పండుగను 12 రకాల వెజిటేరియన్ వంటలతో జరుపుకున్నా: మంచు లక్ష్మి
హైదరాబాద్‌లో నిర్వహించిన ఐఫా వేడుకలకు సినీనటి, నిర్మాత మంచు లక్ష్మి వచ్చి, మీడియాతో మాట్లాడింది. తాను ఉగాది వేడుకలను ఎలా జరుపుకుందో వివరించి చెప్పింది. 12 రకాల వెజిటేరియన్ వంటలతో ఉగాదిని జరుపుకున్నానని, తన కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపానని పేర్కొంది. కాగా, ఐఫాలాంటి పెద్ద ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం పట్ల మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేసింది. ఎంతో మంది నటీనటులు ఇక్కడకు వస్తున్నారని, అందుకు సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించింది.