: ప్రధాని, ముఖ్యమంత్రి ఫోటోలకు దండలేసి నివాళులర్పించిన మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోకు మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు, ఇండోర్‌ మేయర్‌ మాలినీ గౌద్‌ దండేసి నివాళులర్పించిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. సాధారణంగా మృతి చెందిన వారికే ఇలా దండ‌లు వేసి నివాళుల‌ర్పిస్తారు. అయితే, మోదీపై భ‌క్తిని చాటుకునే క్ర‌మంలోనో.. ఏమో.. ఆమె ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మాలిని చనిపోయిన తన భర్త ఫొటో పక్కనే ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ల ఫొటోలను కూడా పెట్టింది .

త‌న భ‌ర్త ఫొటోతో పాటు ఆ ఫొటోల‌కు కూడా పనిలోపనిగా దండలు వేసేసింది. స‌ద‌రు మ‌హిళ దివంగత మాజీ కేబినెట్‌ మంత్రి లక్ష్మణ్‌ సింగ్‌ గౌవద్‌ సతీమణి. తాజాగా ఆమె త‌న ఇంట్లో ఓ వేడుక జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగానే ఇలా చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జితు పట్వారీ మాట్లాడుతూ మేయర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఆమె బీజేపీకి చెందిన నాయ‌కురాలు కాబ‌ట్టే ఆ పార్టీ చర్య తీసుకోవడం లేదని మండిప‌డ్డారు.

  • Loading...

More Telugu News