: చిరంజీవి పాటలకు అఖిల్... నాగార్జున పాటలకు సాయి ధరమ్ తేజ్ డ్యాన్స్!
హైదరాబాదులోని హెచ్ఐసీసీలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఐఫా దక్షిణాది సినీ అవార్డుల ప్రదానోత్సవంలో హీరోయిన్లు డాన్సులు ప్రదర్శించారు. వారితోపాటు టాలీవుడ్ యువ నటులు అఖిల్ అక్కినేని, సాయి ధరమ్ తేజ్ కూడా స్టేజ్ షో ఇచ్చారు. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మెగాస్టార్ చిరంజీవి పాటలకు డాన్స్ చేయగా, సాయి ధరమ్ తేజ్ యువసామ్రాట్ నాగార్జున సినిమాల్లో పాటలకు డాన్స్ వేశాడు. చివర్లో ఇద్దరూ కలిసి 'అమ్మడూ లెట్స్ గో కుమ్ముడూ' అంటూ సందడి చేశారు. అనంతరం స్టేజ్ దిగి ముందు వరుసలో ఉన్న శ్రియ, సమంత, మంచు లక్ష్మి తదితరులతో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.