: ట్రిపుల్ తలాక్ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించిన సుప్రీంకోర్టు
మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చేసి, మరొకరిని పెళ్లి చేసుకోవచ్చనే పద్ధతిని పలువురు ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. దీన్ని రద్దు చేయాలని కోరుతూ పలువురు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. అయితే, ఈ విధానంపై స్పందించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) భార్యలను చంపడం కంటే విడాకులే మేలని పేర్కొని, మతం కల్పించిన హక్కులను న్యాయస్థానాలు ప్రశ్నించలేవని పేర్కొంది.
అయితే, ట్రిపుల్ తలాక్‌పై వచ్చిన పిటిషన్లపై విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు ఈ రోజు అప్పగించింది. ఈ పిటిషన్‌లపై విచారణ ఈ ఏడాది మే 11 నుంచి ప్రారంభమవుతుందని చెప్పింది. ట్రిపుల్ తలాక్ అంశం ఎంతో సున్నితమైన అంశం కావడంతో న్యాయస్థానం తప్పనిసరిగా విచారణ చేపట్టాలని పిటిషన్లరు అత్యున్నత న్యాయస్థానం ముందు విన్నవించుకున్నారు.