: కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారని గంటాపై అక్కసు వెళ్లగక్కుతున్నారు: జగన్ పై విష్ణుకుమార్ రాజు విమర్శలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ కారణంతోనే కడప టీడీపీ ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావును జగన్ లక్ష్యంగా చేసుకొని, ఆయనై అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. చిన్న సమస్యలను పెద్ద నేరంగా చూపుతూ వైసీపీ సభ్యులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రులు నారాయణ, గంటా వియ్యంకులైతే తప్పేంటని ఆయన అన్నారు. పదవ తరగతి ప్రశ్న పత్రం లీకేజీ విషయంలో జగన్ చేస్తోన్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.