: ఫస్టు లుక్ కోసం శ్రమిస్తున్నాం... కొంచెం ఓపికపట్టండి!: అభిమానులకు మహేష్ బాబు సూచన


ఉగాది రోజున మహేష్ బాబు సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుందంటూ గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదల కాకుండానే ఉగాది గడిచిపోయింది. దీంతో మహేష్ బాబు అభిమానులు నిరాశ చెందారు. దీంతో మహేష్ బాబు అభిమానులకు తన ట్విట్టర్ వేదికగా ఒక సూచన చేశాడు. మురుగదాస్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కోసం తమ టీమ్ శ్రమిస్తోందని అన్నాడు. అభిమానులు కొంచెం ఓపిక పడితే ఫస్ట్ లుక్ వస్తుందని చెప్పాడు. అంతవరకు కొంచెం ఓపికపట్టండి...లవ్ యూ గైస్ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, విలన్ గా ప్రముఖ దర్శకుడు ఎస్.జే.సూర్య నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News