: సింగపూర్ లో రన్ వే పై ఢీ కొన్న విమానాలు!
సింగపూర్ లోని చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. నేటి తెల్లవారు జామున నాలుగు గంటలకు చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ కి సిద్ధంగా ఉన్న రెండు రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. సింగపూర్ నుంచి చైనాలోని టియాంజిన్ కు 314 మందితో బయల్దేరిన స్కూట్ విమానాన్ని అదే రన్ వే పై దుబాయ్ వెళ్లేందుకు టేకాఫ్ కు సిద్ధమైన ఫ్లై ఎమిరేట్స్ విమానం ఢీ కొట్టింది. పైలట్లు అప్రమత్తమై విమానాలను వెంటనే ఎగరకుండా నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులను దింపేసి, విమానాలకు మరమ్మతులు ప్రారంభించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.