: మహారాష్ట్రలో వడదెబ్బకు ఐదుగురి బలి... రాష్ట్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు


మహారాష్ట్రలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి కారణంగా వదదెబ్బకు గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాయ్ గఢ్ జిల్లా భిరా గ్రామంలో ఉష్ణోగ్రత 46.5 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. మార్చి నెలలో ఈ స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధ్యయనం చేసేందుకు ఆ గ్రామానికి ఓ బృందాన్ని పంపనున్నట్టు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఇక అకోలాలో 44.1 డిగ్రీలు, వార్థా, నాగ్ పూర్, చంద్రాపూర్ లలో 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత రికార్డయింది. చాలా ప్రాంతాల్లో 40 సెల్సియస్ డిగ్రీలను దాటేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఎండలు తారస్థాయికి చేరాయి. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలకు మించి నమోదవుతున్నాయి.

  • Loading...

More Telugu News