: తల్లిదండ్రుల మాటలు వినకపోతే వారిలా తయారవుతారు.. జనం మాట వినకపోతే జగన్‌లా తయారవుతారు: మంత్రి గంటా


ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ప్ర‌శ్నప‌త్రం లీకేజీపై చ‌ర్చ సంద‌ర్భంగా  ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై మండిప‌డ్డారు. ఈ అంశంలో త‌మ స‌ర్కారే దర్యాప్తు చేసి నారాయణ కళాశాల పేరును బయటపెట్టిందని ఆయ‌న అన్నారు. అంతేగాని ప్రతిపక్షం ఆ పేరును బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యంపై మొద‌ట‌ తామే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ లీకేజీ వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌పై మండిప‌డుతూ... తల్లిమాట వినకపోతే రాహుల్ గాంధీలా, తండ్రి మాట వినకపోతే అఖిలేశ్ యాద‌వ్‌లా త‌యార‌వుతారని.. అయితే, జనం మాట వినకపోతే జగన్‌లా తయారవుతారని చుర‌క‌లు అంటించారు.

  • Loading...

More Telugu News