: జగన్ ఉగ్రవాదే... ప్రతిపక్ష నేత కాకుంటేనా...: చంద్రబాబు
"ఆర్థిక నేరాలకు పాల్పడిన రామలింగరాజు, సుబ్రతారాయ్, హర్షద్ మెహతాల కోవకే జగన్ మోహన్ రెడ్డి చెందుతారు అధ్యక్షా. డెమోక్రసీలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తోంది. మీరు ఆ ప్రతిపక్ష నాయకుడు కాకపోతే, ఈ పోలీసుల దృష్టిలో ఉగ్రవాది. ఆర్థిక నేరస్తుడు తప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇష్టప్రకారం మాట్లాడితే కాదు. ఏదో 20 మంది మెంబర్లు ఉన్నారని ఇష్టప్రకారం విమర్శలు చేయడం కాదు అధ్యక్షా... ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెబుతున్నా. ఎవరు తప్పు చేసినా ఒక ముఖ్యమంత్రిగా ఎంక్వైరీ చేయిస్తా. అదే స్టింగ్ ఆపరేషన్ అని తేలితే, మీ పేపర్ పైనా యాక్షన్ తీసుకుంటా. అదే మాదిరిగా, ఇది నారాయణా స్కూల్ లో చేసివున్నారని తేలితే, వారిపైనా యాక్షన్ తీసుకుంటా. నారాయణ యాజమాన్యం హస్తముందని తేలితే వారిపైనా యాక్షన్ తీసుకుంటానే తప్ప ఎవరినీ వదిలి పెట్టనని మరోసారి హామీ ఇస్తున్నా" అని చంద్రబాబు చెప్పారు.