: ‘బాహుబలి’ కత్తి, డాలు పట్టుకున్న ఎన్టీఆర్!
ఐఫా అవార్డుల కార్యక్రమానికి హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్కడ సందడి చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన ‘బాహుబలి వీఆర్’ జోన్‌కు వెళ్లి బాహుబలి కత్తి, డాలు పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ వినియోగించిన ఆయుధాలు పట్టుకున్న ఎన్టీఆర్ ఫొటోను ఆ సినిమా బృందం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘బాహుబలి వీఆర్’ జోన్‌లో ఎన్టీఆర్ కనిపించడం పట్ల బాహుబలి టీమ్ హర్షం వ్యక్తం చేసింది. గతంలో దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్‌కి మూడు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన విషయం తెలిసిందే.
Happy to have 'Youngtiger' NTR @tarak9999 at @BaahubaliVR Zone at #IIFAUtsavam.. pic.twitter.com/D3Pqv0hsbW
— Baahubali (@BaahubaliMovie) March 29, 2017