: ‘నిషేధం’పై నిషేధం కొనసాగింపు... ట్రంప్‌కు హవాయి కోర్టులో మరోసారి చుక్కెదురు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘ట్రావెల్ బ్యాన్’పై నిషేధం విధిస్తూ కొన్ని రోజుల క్రితం హవాయి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆ సమయంలో ఆరు ముస్లిం దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించిన నేపథ్యంలో కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. అయితే, తాజాగా ఆ కోర్టులో ఇదే అంశం మరోసారి విచారణకు రాగా హవాయిలోని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌పై నిషేధాన్ని కొనసాగించాలని తీర్పునిచ్చి, అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసి ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ సర్కారు కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ.. ఉగ్రవాదం, విదేశీ విద్యార్థులు, విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకోవడాన్ని ఈ నిషేధం కట్టడి చేస్తుందని తెలిపింది.