: కెన్యా మహిళ ఆరోపణలు నిజం కాదు... మానసిక కుంగుబాటు వల్లే అలా చెప్పిందట!


గ్రేటర్ నోయిడాలో బుధవారం ఉదయం స్థానికులు తనపై దాడి చేశారంటూ కెన్యా దేశానికి చెందిన ఓ మహిళ చేసిన ఆరోపణలు నిజం కాదని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా దక్షిణాఫ్రికా విద్యార్థుల సంఘం మీడియాకు తెలిపింది. ఈ ఘటన తమను ఇబ్బందికి గురిచేసిందని, కుటుంబ సమస్యల కారణంగా ఆమె మానసికంగా తీవ్ర వేదనలో ఉండే అలా చెప్పానని తమకు తెలిపినట్టు పేర్కొంది. కెన్యా మహిళ మారియా ఆరోపణలు నిజం కాదని తేలడంతో కేసును వెనక్కి తీసుకోవాలని కెన్యా ఎంబసీ కూడా నిర్ణయించింది. తప్పుడు కేసును నమోదు చేసినందుకు మారియాపై కేసు నమోదు చేయబోమని పోలీసుల నుంచి హామీ లభించింది.

  • Loading...

More Telugu News