: యాంటీ రోమియో స్క్వాడ్ లో ఉండి పార్కులో అమ్మాయిని వేధించిన ఎస్ఐ


యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆదిత్యనాథ్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటైన యాంటీ రోమియో స్క్వాడ్ లో భాగంగా ఉండి, యువతులను వేధించే పోకిరీల పని పట్టాల్సిన ఓ ఎస్ఐ, స్వయంగా అమ్మాయిని ఏడిపించి సోషల్ మీడియా పుణ్యమాని అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన లోహియాలో జరిగింది.

మెయిన్ పురి సబ్ ఇనస్పెక్టర్ నరేశ్ యాదవ్, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో కలిసి ఓ పార్కులో తనిఖీలకు వెళ్లారు. మహిళా కానిస్టేబుళ్లు అక్కడ ఉన్న అమ్మాయిలపై కేకలేస్తూ, ఇంటికి వెళ్లిపోవాలని హెచ్చరిస్తుంటే, ఎస్ఐ ఓ అమ్మాయిని వేధించాడు. ఆమె చెవులు పట్టి లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను ఓ యువకుడు తన మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతనిపై వేటు వేసిన ఉన్నతాధికారులు, దర్యాఫ్తునకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News