: వందేమాతరం ఆలపించని కార్పొరేటర్లు.. బయటకు పొమ్మన్న మీరట్ మేయర్!


రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించి, కార్యక్రమాలు ప్రారంభమవడానికి ముందు వందేమాతరం ఆల‌పించింది. అంద‌రూ వందేమాతరం పాడాల‌ని బీజేపీ నేత‌, మీరట్‌ మేయర్‌ హరికాంత్‌ అహ్లువాలియా అన్నారు. అయితే, ఈ సంద‌ర్భంగా ఏడుగురు కార్పొరేటర్లు ఆయ‌న ఆదేశాలను పాటించ‌లేదు. దీంతో ఆగ్ర‌హం తెచ్చుకున్న స‌ద‌రు మేయ‌ర్ తాను నిర్వహిస్తున్న సమావేశానికి హాజరుకాకూడ‌ద‌ని వారిని ఆదేశించారు. వారు ఈ సమావేశంలో ఉండకూడదని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. ప్రస్తుతం మీరట్‌ కార్పొరేషన్‌లో బీజేపీకే మెజార్టీ ఉంది. ఆ స‌మావేశంలో పాల్గొన్న ఆ ఏడుగురు కార్పొరేటర్లు వందేమాతరం ఆలపించబోమని, ఇలాంటి స‌మావేశాల్లో అలాంటి రూల్స్ వద్దని వారు చెప్పారు. దీంతో ఆగ్రహించిన మేయ‌ర్ వారిని బయటకుపొమ్మన్నారు. ఇప్పుడిది తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News