: అలీఘడ్‌ ముస్లిం వర్సిటీ భోజనం మెనూ నుంచి మాంసం మాయం!


ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ త‌మ రాష్ట్రంలో న‌డుస్తోన్న అక్ర‌మ‌ క‌బేళాలను మూసివేయాల‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న జారీ చేసిన ఈ ఆదేశాలు అలీఘడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఇక‌పై మాంసం పెట్ట‌ని ప‌రిస్థితికి తీసుకువ‌చ్చాయి. ఆ వ‌ర్సిటీలో వారానికి రెండుసార్లు మాంసాన్ని పెట్టేవారు. ఇప్పుడు ఆ మెనూలో నుంచి మాంసం మాయం అయింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మాంసం లభించని పరిస్థితి నెల‌కొన‌డంతో వారం రోజుల నుంచి వారికి కేవలం కూరగాయల భోజనం మాత్ర‌మే పెడుతున్నారు. దీంతో ఆ వర్సిటీ వీసీ నేడు విద్యార్థి సంఘాలతో భేటీ అయ్యి త‌మ‌ మెనూలోంచి మాంసాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News