: మీరు మాట్లాడిన తరువాతే నేను మాట్లాడతాను: పవన్ కల్యాణ్
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన వేదికపై మాట్లాడుతూ మొదట అగ్రిగోల్డ్ బాధితులు మాట్లాడాలని, వారి కష్టాలు వింటానని చెప్పారు. వారు మాట్లాడిన తరువాతే తాను మాట్లాడతానని పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న పవన్ కల్యాణ్‌కు తాము పడుతున్న బాధల గురించి చెప్పుకుంటున్నారు. నిరాహార దీక్షలు, నిరసనలు తెలిపినా తమకు న్యాయం జరగకుండా పోతోందని చెప్పారు. పవన్ కల్యాణ్ తమ సమస్యలను వినడానికి వచ్చినందుకు ధైర్యంగా ఉందని చెప్పారు.