: చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేయడం లేదు... కానీ నత్తనడకన సాగుతోంది: పవన్ కల్యాణ్
అగ్రీగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని భావించాల్సిన అవసరం లేదని, అయితే, డబ్బు తిరిగి చెల్లింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని మాత్రం తాను చెప్పగలనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేసు నిదానంగా సాగుతుండటం, అగ్రీగోల్డ్ ఆస్తుల వేలం ముందడుగు వేయకపోవడానికి కారణాలు తనకు తెలియవని, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని, ఈ విషయంలో న్యాయవాదుల అభిప్రాయాలను తీసుకుంటానని చెప్పారు. బాధితులతో మాట్లాడిన తరువాత, ప్రభుత్వంతో ఈ విషయంలో చర్చించాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయించుకుంటానని అన్నారు. అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్న వేళ, అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరగడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు.