: ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వకుండా సభను అన్యాయంగా నడుపుతున్నారు: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు గందరగోళం చెలరేగిన విషయం తెలిసిందే. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇలాంటి సభను ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాగోలేదని అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వకుండా సభను అన్యాయంగా నడుపుతున్నారని ఆయన అన్నారు.