: ఆంధ్రజ్యోతి ఆఫీసులో కేటీఆర్... స్వాగతం పలికిన వేమూరి రాధాకృష్ణ
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇటీవల నిర్వహించిన గోల్డ్ అండ్ కార్ రేస్ మెగా బంపర్ డ్రాలో విజేతలను ఎంపిక చేసేందుకు తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్, పత్రిక కార్యాలయానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికిన పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, సాదరంగా లోపలికి ఆహ్వానించి, ఉన్నతోద్యోగులను పేరుపేరునా పరిచయం చేశారు. అనంతరం డ్రా తీసిన కేటీఆర్ విజేతల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిని కనబరిచారు.