: విమానం దిగి శాసనసభకు వస్తారు.. మళ్లీ విమానం సమయానికి వెళ్లిపోతారు!: జగన్ పై గంటా విసుర్లు
విపక్ష నేత వైఎస్ జగన్, విమానం దిగి సరాసరి అసెంబ్లీకి వస్తారని, తిరిగి విమానం సమయం కాగానే అసెంబ్లీ నుంచి వెళ్లిపోతారని మంత్రి గంటా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ పై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా, వినకుండా పోడియంపై దాడి చేస్తున్నారని విమర్శించిన ఆయన, అమరావతిలో కనీసం ఒక ఇంటిని కూడా ఆయన అద్దెకు తీసుకోలేదని ఆరోపించారు. గవర్నర్ ఇస్తున్న టీపార్టీలో పాల్గొనేందుకు మొన్న సభను ఆయన వదిలి వెళ్లారని, అదే రోజు సభలో ఉంటే, ఈ సమస్యపై చర్చించి, సమాధానం ఇచ్చి వుండే వాళ్లమని అన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయానికి వైకాపా సభలో ఉండదని చెప్పారు.