: మొగల్తూరులో దుర్ఘటన.. రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఐదుగురి మృతి!
రసాయనాల ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులు నల్లా ఏడుకొండలు, ఈగ ఏడుకొండలు, రాంబాబు, ప్రవీణ్, తోట శ్రీనులుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.