: చ‌దివే కోర్సు ఇష్టం లేక కాలేజీ నాలుగో అంత‌స్తు నుంచి దూకేసిన విద్యార్థి


తాను ఓ కోర్సు చ‌ద‌వాల‌నుకున్నాడు.. కానీ, ఆ విద్యార్థి తల్లిదండ్రులు అత‌డిని మ‌రో కోర్సులో చేర్చారు.. త‌న‌కు న‌చ్చ‌ని కోర్సును చ‌దివిస్తున్నారంటూ చివ‌రికి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు ఆ విద్యార్థి. ఐఐటీ ఢిల్లీకి చెందిన హాస్టల్‌ నాలుగో అంతస్తు నుంచి ఆ విద్యార్థి దూకేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విద్యార్థి కాళ్లు, తుంటి భాగం దెబ్బతిందని వైద్యులు తెలిపారు.

త‌న హై స్కూలు పూర్తి కాగానే తనకు నచ్చిన కోర్సులో కాకుండా త‌మ‌ తల్లిదండ్రులు ఐఐటీలో చేర్చార‌ని ఆ విద్యార్థి త‌న స్నేహితుల‌తో త‌రుచూ చెబుతుండేవాడు. త‌న‌కు న‌చ్చ‌ని కోర్సులో తాను చదవలేకపోతున్నానని అనేవాడు. చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఆ విద్యార్థి నాలుగో అంతస్తుకు చేరుకుని ఒక్కసారిగా పరుగెత్తి దూకేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కున్నాడ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News