: జమాత్ ఉద్ దవాకు కొత్త బాస్... భారత సైన్యానికి ధైర్యం లేదన్న హఫీజ్ తల్హా సయీద్
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, మరో ఉగ్రవాద సంస్థ జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్, తండ్రి వారసత్వాన్ని స్వీకరించాడు. జేయూడీకి కొత్త బాస్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, భారత్ పై పోరాటం కొనసాగుతుందని, కాశ్మీర్ కు స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేస్తానని ఆయన మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వినిపించాలని పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలకు తాను మద్దతిస్తానని, ఉగ్రవాద చర్యగా ఈ అంశాన్ని పరిగణించరాదని, తమ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నాడు. ఈ వీడియోలో భారత సైన్యాన్ని తిట్టాడు. ఇండియన్ ఆర్మీకి తమను ఎదుర్కొనే ధైర్యం లేదని అన్నాడు. కాగా, హఫీజ్ సయీద్ హౌస్ అరెస్టు తరువాత జేయూడీకి కొత్త బాస్ గా తల్హా బాధ్యతలు స్వీకరించాడు.