: ఏపీ ఎమ్మెల్యేలకు 'స్వీట్' గిఫ్ట్... బందర్ లడ్డూల పంపిణీ!


ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల వంటకాలకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకురావాలన్న లక్ష్యంతో, నేడు బందర్ లడ్డూలను ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేరు వినగానే నోరూరించే లడ్డూలను అందరికీ ఇచ్చి, లడ్డూల ప్రత్యేకతను తెలియజేయాలని, అమ్మకాలను ప్రోత్సహించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో, సమావేశాలు ముగిసే వరకూ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. దీంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర వంటకాల స్టాల్స్ అసెంబ్లీ ప్రాంగణంలో రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇక్కడ బందర్ లడ్డూలు సహా, పూతరేకులు, కాజాలు, చక్కిలాలు వంటి తినుబండారాలను విక్రయానికి ఉంచుతారు.

  • Loading...

More Telugu News