: 'కాటమరాయుడు' అంత ఎక్కువగా ఏమీ లేదు.. నార్మల్ గా వుంది!: వైరల్ అవుతున్న కేసీఆర్ మనవడి వీడియో
హైదరాబాద్ లో జరిగిన సౌత్ ఇండియా సినిమా అవార్డుల కార్యక్రమం 'ఐఫా'లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, మనవడు, మునిసిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, తాను లేటెస్టుగా 'కాటమరాయుడు' సినిమా చూశానని చెప్పిన హిమాన్షు, "కాటమరాయుడు అంత ఎక్కువగా ఏమీ లేదు. నార్మల్ గా ఉంది" అన్నాడు. ఈ వీడియోను పలువురు తమ ఫేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంట్లలో షేర్ చేసుకుంటున్నారు.