: నేటి నుంచి లారీల దేశవ్యాప్త సమ్మె.. ఏపీలో నిలిచిపోయిన 3 లక్షల లారీలు
సమస్యల పరిష్కారం కోరుతూ రవాణాశాఖతో రెండు రోజుల క్రితం జరిపిన చర్చల్లో కొన్ని అంశాలకే హామీ లభించడంతో నేడు దేశవ్యాప్తంగా లారీ యజమానులు బంద్ పాటిస్తున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల లారీలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి ప్రధానమైన సమస్యల పరిష్కారంలో ఎటువంటి హామీ రాకపోవడంతో బంద్‌కు వెళ్లడం మినహా మరో మార్గం లేదని లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వర్‌రావు తెలిపారు. బంద్ నుంచి తాగునీరు, మందులు, పాలు వంటి అత్యవసర రవాణాకు మినహాయింపు ఇచ్చారు. డీజిల్, పెట్రోలు, కూరగాయలు, ఇతర సరుకుల రవాణాపై బంద్ ప్రభావం పడనుంది.