: యూపీలో బీజేపీ విజయంతో వణుకుతున్న ముస్లింలు: ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్‌ బుఖారీ


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి ముస్లింలలో భయం, ఆందోళన నెలకొన్నాయని ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్‌ బుఖారీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా వాతావరణం ఉండాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి సంస్కృతి, సంప్రదాయాలు, మతపరమైన ఐక్యతను కాపాడతాయని ఆశిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు భద్రత, ఉపాధి, విద్య, న్యాయం కల్పించడంలో ప్రభుత్వాలు కీలకపాత్ర పోషిస్తాయని తాను అభిలషిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News