: పట్టాలు తప్పిన మహాకోశల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. నిశిరాత్రిలో ఘటన
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న మహాకోశల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని మహోబా-కుల్పహర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. 8 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో నాలుగు ఏసీ, నాలుగు జనరల్ బోగీలున్నాయి. 18 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను మహోబా జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. బాధితుల సమాచారం కోసం ఝాన్సీ, గ్వాలియర్, బాంద్రా, నిజాముద్దీన్ స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.