: కవల పిల్లలతో ఇంటికి చేరిన బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్!
సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తండ్రయ్యానని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 7న నెలలు నిండకుండా జన్మించడంతో వారిద్దరినీ ముంబైలోని సూర్య ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స చేసిన వైద్యులు వారు పూర్తి ఆరోగ్యాన్ని పొందడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కరణ్ జోహర్ తమ కవలపిల్లలను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. కాగా, తనకు ఇద్దరు పిల్లలు పుట్టారని, కుమార్తె పేరు రూహి, కుమారుడి పేరు యాష్ అని ఈ నెల 5న కరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరణ్, ఇకపై మానసికంగా, భౌతికంగా, భావోద్వేగంతో కూడిన ప్రేమను తన బిడ్డలకు పంచేందుకు సిద్ధమయ్యానని ప్రకటించాడు.