: ఐఫా సినీ అవార్డుల వేడుకలో సందడి చేసిన కేసీఆర్ మనవడు హిమాన్షు


హైదరాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 'ఐఫా' సౌతిండియా సినీ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు సందడి చేశాడు. అవార్డు కార్యక్రమానికి వచ్చిన హిమాన్షు... తనకు ఫేవరేట్ హీరోలెవరూ లేరని అన్నాడు. అన్ని సినిమాలు చూస్తానని చెప్పాడు. ఎవరి సినిమా అయినా నచ్చితే మళ్లీ చూస్తానని చెప్పాడు. అవుట్ డోర్ గేమ్స్ లో స్విమ్మింగ్ ఇష్టమని, ఇన్ డోర్ గేమ్స్ లో అన్ని వీడియో గేమ్స్ తనకు ఇష్టమని చెప్పాడు. ఈ మధ్యే తన తండ్రితో కలిసి కాటమరాయుడు సినిమా చూశానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News